కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా యాక్షన్ ఎంటర్ టైనర్ 'తునివు'. ఆ సినిమాని 'తెగింపు' అనే పేరుతో అనువాదరూపంలో తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల చేశారు.'నేర్కొండ పరవాయ్, వలిమై' అనంతరం హెచ్.వినోద్-అజిత్ ల కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఈ తునివు. ఈరోజు తమిళనాడులో భారీగా విడుదల అయ్యింది. మరి సినిమా ఎలా వుంది? హిట్టా? ప్లాపా? అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..ముందుగా తెగింపు కథ విషయానికి వస్తే.. వైజాగ్ లోని (తమిళ్ లో చెన్నై) 'యువర్ బ్యాంక్'లోకి దొంగలు చొరబడతారు. అయితే ఆ బ్యాంక్ లో ఉన్న 500 కోట్ల రూపాయల ఓవర్ లోడెడ్ మనీని దొంగతనం చేయడమే లక్ష్యంగా మొదలైన ఈ దోపిడీలోకి డార్క్ డెవిల్ (అజిత్) ఎంటరావుతాడు. అప్పటి దాకా 500 కోట్ల కోసమే దొంగతనం జరుగుతుందని అందరూ అనుకుంటారు.. కానీ అసలు దొంగతనం ఏకంగా 25000 కోట్ల రూపాల దోపిడీ అని తెలిసేసరికి షాక్ కి గురవుతారు.


అసలు ఆ 25000 కోట్ల డబ్బు ఒక బ్యాంక్ లోకి ఎందుకొచ్చాయి? ఇంకా ఈ విషయం డార్క్ డెవిల్ కి ఎలా తెలిసింది? అసలు ఈ దొంగతనం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.చాలా చక్కగా స్టార్ట్ ఈ సినిమా.. ఇంటర్వెల్ బ్లాక్ కి వచ్చేసరికే స్లో గా సాగిపోతుంది.అసలు అజిత్ ఎందుకు బ్యాంక్ దొంగతనానికి పూనుకుంటాడు అనేందుకు ఇచ్చిన జస్టిఫికేషన్ ఇంకా అలాగే ఫ్లాష్ బ్యాక్ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది.డైరెక్టర్ వినోద్  విఫలమయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్  కంపోజ్ చేసిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. అయితే అజిత్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అజిత్ స్వాగ్ అండ్ స్టైల్ చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: