
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది..ఇందులో ఆమె వేసిన మాస్ డ్యాన్స్ చేసిన అద్భుతమైన యాక్టింగ్ ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లేలా అయితే చేసింది..ముఖ్యంగా ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్స్ కి థియేటర్స్ అన్ని కూడా ఊగిపోయాయి..శ్రీలీల కి ఉన్న క్రేజ్ ని బాగా అర్థం చేసుకున్న దర్శక నిర్మాతలు ఆమె తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు క్యూ కట్టేస్తున్నారటా..ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, ఆ తర్వాత కూడా క్రేజీ ఆఫర్స్ ని తన బుట్టలో వేసుకుందని తెలుస్తుంది.
శ్రీలీల ఫాలోయింగ్ ని చూసిన స్టార్ హీరోయిన్స్ తమ రెమ్యూనరేషన్స్ ని బాగా తగ్గించేసుకుంటున్నారటా..ఒక్క స్టార్ హీరోయిన్ నేడు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని తీసుకుంటున్నారు..కానీ శ్రీలీల కేవలం కోటి రూపాయలకే నిర్మాతలకు కాల్ షీట్స్ ఇచ్చేస్తుందటా...ఆమెకి రోజు రోజుకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుందటా...ఇలాంటి సమయం లో రెమ్యూనరేషన్ విషయం లో బెట్టు చేస్తే మొదటికే మోసం వస్తుందని అర్థం చేసుకున్న స్టార్ హీరోయిన్స్ ముప్పై శాతం రెమ్యూనరేషన్ ని కుదించుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలుస్తుంది...ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది..