ఇటీవల బాలయ్య తన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ ఫంక్షన్ లో లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మీద చేసిన కామెంట్స్ కి క్షమాపణ చెప్పాలంటూ అనంతపురంలో ఏఎన్నార్ ఫ్యాన్స్ నిరసన చేపట్టారు. బాలయ్య కామెంట్స్ ని నిరసిస్తూ నెల్లూరు నర్తకి సెంటర్‌లో అక్కినేని ఫ్యాన్స్ నిరసన చేపట్టారు. బాలకృష్ణ తన కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలయ్య మాటలకు అక్కినేని ఫ్యాన్స్ హర్టవ్వడంతో అక్కినేని వారసుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. కళామతల్లి ముద్దు బిడ్డల్ని అగౌరవపరచడం అనేది మనల్ని మనం కించపరుచుకోవడమే అని అటు చైతూ, అఖిల్ నోట్ విడుదల చేశారు.అయితే ఈ బర్నింగ్ ఇష్యూపై తాజాగా సత్యసాయి జిల్లా హిందూపురంలో బాల కృష్ణ స్పందించారు. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్‌లో ఫ్లోలో అన్న మాటలే తప్ప నాగేశ్వరరావు గారిని కించపరిచే విధంగా తానేం మాట్లాడలేదని ఆయన తెలిపారు. ఏఎన్నార్ గారిని బాబాయ్ అని పిలుస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు.


ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ ఇంకా ఏఎన్నార్ నుంచి పొగడ్తలకు పొంగిపోకూడదనే విషయాన్ని నేర్చుకున్నట్లు బాలయ్య వివరించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన పిల్లల కంటే తననే ఎక్కువగా ప్రేమించేవారు బాలయ్య చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరూ రెండు కల్లలాంటివారని బాలయ్య అన్నారు. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదని బాలయ్య అన్నారు .ఇక నాన్న చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగిందన్నారు బాలకృష్ణ. ఇక బాబాయిపై ఎప్పుడు ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను ఏమి పట్టించుకోనని గర్జించారు నటసింహం బాలయ్య.ఇక చైతూ, అఖిల్ స్పందనపై బాలయ్య ఫ్యాన్స్ చిన్నబుచ్చుకున్నారు. బయటవాళ్లు ఏమనుకున్నా సరే… బాలయ్య గురించి అన్నీ తెలిసిన అక్కినేని కుటుంబం కూడా ఇలా వ్యవహరించడం ఏమాత్రం బాగాలేదంటూ తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: