కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "సింహాద్రి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో భూమిక , అంకిత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా ఇటు జూనియర్ ఎన్టీఆర్ కి అటు రాజమౌళి కి అద్భుతమైన గుర్తింపు తెలుగు పరిశ్రమలో దక్కింది. ఇకపోతే రాజమౌళి ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో కాకుండా మొదట వేరే హీరోతో చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఆ హీరోకు కథను కూడా వివరించాడట.

ఇక కొన్ని కారణాల వల్ల ఆ హీరోమూవీ కథను రిజెక్ట్ చేయడంతో రాజమౌళిసినిమా కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించడం , ఆయనకు ఈ కథ బాగా నచ్చడంతో వీరిద్దరి కాంబోలో సింహాద్రి సినిమా రావడం జరిగిందట. ఇంతకు సింహాద్రి మూవీ ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా ..? ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి "సింహాద్రి" సినిమా కథతో మూవీ చేయాలి అనుకున్న తర్వాత ఆయన ప్రభాస్ తో తెరకెక్కించాలి అని అనుకున్నాడట.

అందులో భాగంగా ప్రభాస్ ను కలిసి ఆ మూవీ కథను కూడా వివరించాడట. ఇక ప్రభాస్ అప్పటికే చాలా సినిమాలకు కమిట్ అయి ఉండడంతో ఈ మూవీలకు తేదీని అడ్జస్ట్ చేయలేకపోయాడట. దానితో ఈ సినిమా చేయలేను అని రాజమౌళి కి చెప్పాడట. దానితో రాజమౌళి ఇదే కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడట. జూనియర్ ఎన్టీఆర్ కి ఈ కథ బాగా నచ్చడంతో ఆ సినిమాలో హీరో గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కి బ్లాక్ బాస్టర్ విజయం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: