ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రాశి కన్నా.మొదటి సినిమాతోనే హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తమిళంలో మాత్రం విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా అలరిస్తూ బిజీ బిజీగా ఉంది ఈమె .తాజాగా రాజ్ అండ్ కేడి దర్శకత్వంలో వచ్చిన ఫర్జీ వెబ్ సిరీస్ లో నటించింది ఈమె. షాహిద్ కపూర్ మరియు విజయ్ సేతుపతి తో పాటు ఈ సినిమాలో రాశి కన్నా కూడా నటించి అందరిని ఒక్కసారిగా ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ లో మేఘ అనే ఒక కీలక పాత్ర పోషించింది రాశి ఖన్నా. 

ఆర్బిఐ ఆఫీసర్ పాత్రలో అందరినీ ఎంతగానో మెప్పించింది రాశిఖన్నా. అయితే ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో లైవ్లను కూడా పెడుతుంది. ఈ క్రమంలోని సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది రాశి కన్నా. ఇటీవల తన సోషల్ మీడియాలో లైవ్ లో పాల్గొన్న రాశి కన్నా మహేష్ బాబుతో కలిసి ఎప్పుడు నటిస్తారో అని ఒక అభిమాని రాశిఖన్నాని అడగడం జరిగింది. ఇందుకుగానో రాసి కన్నా మాట్లాడుతూ మహేష్ గారికి నేను పెద్ద ఫ్యాన్ మహేష్ బాబు నమ్రత చాలా మంచి వ్యక్తులు ఎప్పటినుండో నేను ఆయనకి వీరాభిమాని.

ఆయనతో కలిసి ఒక సినిమాలో అయినా నటించాలని ఎప్పటినుండో ఆశపడుతున్నాను అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది రాశి కన్నా. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అంటూ కూడా తెలియజేసింది అని తెలుస్తుంది .కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో రాశి కన్నా సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని గతవారం రాశి కన్నా తన సినిమాలకు సంబంధించిన ఒక ఫోటో చూసి కూడా జరిపింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: