పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ గా దూకుపోతున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు నటించిన  చిత్రం ఆర్ఆర్ఆర్. ఆ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు అయితే ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. తాజాగా నాటు నాటు పాట ఆస్కార్స్‌కు కూడా నామినేట్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు అదిరిపోయే స్టెప్పులు వేసిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్,ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. అయితే ఈ సినిమాపై ఫేమస్ తెలుగు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాకి కచ్చితంగా ఆస్కార్(Oscars) వస్తుందని తెలిపారు.ఓ ఫేమస్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఈ కామెంట్స్ చేశారు.


ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు పక్కా వస్తుందని తనకు నమ్మకం ఉంది. ఈ విజయాన్ని ప్రజలందరూ కూడా కలిసి వేడుకలా జరుపుకోవాలని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఈ అవార్డును కేవలం రాజమౌళి సినిమాకు వచ్చిన గుర్తింపుగా చూడకుండా.. తెలుగు సినిమాకు ఇంకా ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవంగా చూడాలని అన్నారు.ఇండియా నుంచి ఓ సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నందుకు గర్వపడాలని అల్లు అరవింద్ పేర్కొన్నారు.ఇంకా అలాగే ఇది తెలుగు సినిమా పరిశ్రమకు గొప్ప ప్రోత్సాహం లాంటిందని.. ఆర్ఆర్ఆర్ సినిమా సాధిస్తున్న అరుదైన విజయాలను ఖచ్చితంగా ఆస్వాదించాలని అన్నారు.మార్చి 12 వ తేదీన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుండగా.. ఈ వేడుక కోసం భారతీయ సినీ ప్రేమికులందరూ కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్ లో నిలిచిన 'నాటు నాటు' పాటకు ఖచ్చితంగా అవార్డు రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: