సినీ పరిశ్రమలో తరాలుగా భాషతో పని లేకుండా ఏ భాషలో అయినా సరే నటించే స్వాతంత్రం అందరికీ ఉంది అని చెప్పవచ్చు. గతంలో మన సౌత్ ఇండస్ట్రీని మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చీప్ గా చూసింది. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల కారణంగా సౌత్ ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ చాలా ఎదిగిపోయింది . ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న తెలుగు హీరోలని చూసి బాలీవుడ్ స్టార్స్ కుళ్ళు కుంటున్నారు అనడంలో సందేహం లేదు చిన్న హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

ఈ క్రమంలోని బాలీవుడ్ నటీనటులు కూడా టాలీవుడ్ లో నటించడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే చాలామంది టాలీవుడ్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు.  ఈ క్రమంలోనే టాలీవుడ్ ని టార్గెట్గా చేసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన బాలీవుడ్ స్టార్స్ జాబితా గనుక గమనించినట్లయితే.. ఇప్పటికే మనోజ్ బాజి పెయ్ కూడా తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే జాకీ ష్రాఫ్ కూడా ప్రాంతీయ భాషలలో అడుగుపెట్టి ఇక్కడ విలన్
 రోల్స్లో మెప్పిస్తున్నాడు.

బాలీవుడ్ కండల వీరుడు , సల్మాన్ ఖాన్ కూడా టాలీవుడ్ లో అడుగుపెట్టి గాడ్ ఫాదర్ సినిమాతో అతిథి పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే . వీరితోపాటు కార్తికేయ సినిమాలో అనుపమ్ కేర్ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలా అమితాబచ్చన్, అజయ్ దేవగన్, సునీల్ శెట్టి కూడా తెలుగులోకి అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను అలరించారు.  వీరితో పాటూ బాబీ డియోల్ , సైఫ్ అలీ ఖాన్ వంటి వారు కూడా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు . ఏది ఏమైనా బాలీవుడ్ లో ఇప్పుడు చాలా సినిమాలు సక్సెస్ అవుతున్నాయి కానీ రికార్డులను బ్రేక్ చేయడం లేదు. అందుకే అక్కడి హీరోలు ఇక్కడ నటించడానికి పయనం అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: