టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్న అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తరకెక్కిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక పుష్పరాజ్ పాత్రతో అల్లు అర్జున్ ఇక సినీ ప్రేక్షకులందరిని ఊపేశాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ చెప్పిన డైలాగులు హావభావాలు కూడా ఎన్నో రోజులపాటు యూత్ ను బాగా ఆకట్టుకుని సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయాయి.



 ఇకపోతే పుష్పా సినిమాలో అల్లు అర్జున్ చేసిన పుష్పరాజ్ పాత్ర గురించి బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఇటీవలే ఒక అవార్డు ఫంక్షన్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. గత ఏడాది వచ్చిన సినిమాలలో తనకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడుతూ... తనకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించినటువంటి పాత్రలో నటించాలని ఒక కోరిక ఉంది అంటూ మనసులో మాట బయట పెట్టేసాడు. గంగు భాయ్ ఖతియవాడి, త్రిబుల్ ఆర్, పుష్ప సినిమాలు ఒక ప్రేక్షకుడిగా నటుడిగా కూడా నన్ను చాలా ప్రభావితం చేశాయి.



 నాకు కూడా పుష్పరాజు లాంటి పాత్రలు వచ్చి ఉంటే బాగుండేది అంటూ రణబీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. అయితే గతంలో పాకిస్తానీ సినిమాలు చేయాలనుంది అని రణబీర్ కపూర్ కామెంట్స్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఈ విషయంపై స్పందిస్తూ.. నేను వెళ్ళిన కార్యక్రమంలో చాలామంది పాకిస్తానీ చిత్ర నిర్మాతలు దర్శకులు పాల్గొన్నారు. మంచి కథలు వస్తే పాకిస్తానీ చిత్రాల్లో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారా అంటూ నన్ను ప్రశ్నించారు. సినిమాకు కలకు ఎలాంటి హద్దులు ఉండవని నేను భావిస్తాను. అందుకే అప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశాను అంటూ రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఇటీవల పుష్పరాజు లాంటి పాత్ర నాకు వచ్చి ఉంటే బాగుండేది అని రణబీర్ కపూర్ అనడంతో ఈ విషయాన్ని బన్నీ ఫాన్స్ బాగా షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: