డబ్ స్మాష్ తో పాపులారిటీ తెచ్చుకున్న ఢిల్లీ భామ కెతిక శర్మ పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో అమ్మడి అందాలకు యూత్ ఆడియన్స్ అంతా గోల పెట్టేశారు. సినిమా హిట్టైతే పరిస్థితి వేరేలా ఉండేది కానీ సినిమా ఫ్లాప్ అయ్యే సరికి అమ్మడు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. అయినా కూడా అమ్మడికి ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా చేసినా లాభం లేకపోయింది.

ఇక సినిమా అవకాశాలు ఎలా ఉన్నా ఫోటో షూట్స్ తో దుమ్ము దులిపేయాలని ఫిక్స్ అయిన కెతిక శర్మ తన హాట్ ఫోజులతో అదరగొట్టేస్తుంది. ఇక ఆ దెబ్బతో అమ్మడికి మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కెతిక శర్మ. పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్ కలిసి చేస్తున్న వినోదయ సీతం రీమేక్ లో తేజ్ కి జోడీగా కెతిక నటిస్తుందని తెలుస్తుంది. పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఈ సినిమా తర్వాత అమ్మడికి వద్దన్నా సరే వరుస అవకాశాలు వచ్చేస్తాయి.

ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. కెతిక శర్మ, ప్రియా ప్రకాశ్ ఇద్దరు ఈ సినిమాకు గ్లామర్ తెచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ ఉంటుందని అన్నారు కానీ నిర్మాతలు సినిమా కాస్ట్ అండ్ క్రూ లిస్ట్ లో ఆమె పేరు లేదు. కెతికకు వచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ ని ఎలా వాడుకుంటుందో చూడాలి. తప్పకుండా కెతికకు ఇదొక గొప్ప అవకాశమని చెప్పొచ్చు.3 సినిమాలు చేసినా అవి 3 ఫెయిల్ అవగా పవర్ స్టార్ సినిమాతో అమ్మడు హిట్ కొట్టాలని చూస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: