తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ సమంత. ఇమే మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ వరకు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉంది. ఇదంతా ఇలా ఉంటే త్రీడీలో ఈ సినిమాని ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి గుణశేఖర్ సిద్ధమవుతున్నారు.


సమంత మార్కెట్ రేంజ్ కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది  ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించడంతో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి . దీంతో  ఈ సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ ని సమంత, దిల్ రాజు చూసినట్లుగా సమాచారం.ఈ మూవీని చూసినట్లు సమంత తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ షేర్ చేయడం జరిగింది.


గుణశేఖర్ గారు అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు  మీరు నా హృదయాన్ని గెలుచు కున్నారు ఇంత అద్భుతమైన చిత్రాన్ని మీరు నాకు అందిస్తున్నందుకు నా లైఫ్ లో మర్చిపోలేని చిత్రంగా గుర్తుపెట్టుకుంటానని తెలిపింది సమంత ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని తెలియజేస్తోంది. ఇక వారి ఎమోషన్ ని చూడటానికి నేను ఇంకా ఎదురు చూడలేకపోతున్నాను అంటు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇప్పుడు ఆ ట్విట్టర్ కాస్త వైరల్ గా మారడం జరుగుతుంది ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: