
అయితే ఇలా సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఇక సినిమా హీరోలకు సంబంధించి పాత ఫోటోలు ఏవైనా తెర మీదకి వచ్చాయంటే చాలు అవి తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరు అన్నది గుర్తుపట్టలేకపోతున్నారు చాలామంది నెటిజన్లు. ఈ ఫోటోలో ఉన్నది ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో. హీరో గానే కాదు విలన్ గాను రాణిస్తున్నాడు.
డాన్సుల్లో కూడా ఇరగదీస్తూ ఉంటాడు. ఈ హీరో నటించిన ఒక సినిమా అయితే సెన్సేషన్ సృష్టించింది అని చెప్పాలి. ఇక అంతకుమించి ఈ హీరో మెగాస్టార్ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పాలి. ఇంత చెప్పిన తర్వాత అయినా ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరు గుర్తుపట్టారా.. కాస్త కష్టమే అనిపిస్తుంది కదా. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే ఆర్ఎక్స్ 100 మూవీ తో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ. ఈ ఫోటోలో అతని పక్కనే ఉన్నది అతని సిస్టర్. ప్రేమతో మీ కార్తీక్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్, అజిత్ నటించిన వాలిమై సినిమాల్లో విలన్ గాను మెప్పించాడు కార్తికేయ. అయితే ఇక ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ ఫాన్స్ షాక్ అవుతున్నారు.