
అయోధ్య భద్రాచలం ఆలయాలతో పాటు మరికొన్ని శ్రీరాముడి ఆలయాలలో ఈసినిమా ప్రమోషన్ ను పూర్తి భక్తి శ్రద్ధతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమోషన్ లో ఈసినిమా యూనిట్ అంతా తిరుగుతూ దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేయబోతున్నారు. జూన్ నెలకు సంబంధించిన మొదటి రెండు వరాలు ‘జై శ్రీరామ్ నినాదం మాత్రమే అందరికీ వినిపించేలా ‘ఆదిపురుష్’ టీమ్ హోరెత్తించబోతున్నారు.
ఈ మూవీ ట్రైలర్ కు విపరీతమైన స్పందన వస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ‘జై శ్రీరామ్’ పాటకు విపరీతమైన స్పందనతో పాటు లైకులు కూడ వస్తున్నాయి. అతుల్ అజయ్ కంపోజింగ్ లో వచ్చిన ఈ తెలుగు వెర్షన్ పాటకు రామజోగయ్య శాస్త్రి అందించిన పద సాహిత్యం చాల బాగుంది అని మెచ్చుకుంటున్నారు. రఘురాముడి గుణగణాలను వర్ణిస్తూనే ఆయన అభయం ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందో వర్ణించిన తీరు చాలామందికి నచ్చింది. శ్రీరామ నవమితో పాటు ఇకపై ఆ దేవుడికి సంబంధించిన ఏసందర్భంలో అయినా ఉపయోగించుకునేలా ‘జై శ్రీరామ్’ ట్యూన్ చేసిన విధానం అందరికీ విపరీతంగా నచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను 5వేల ధియేటర్లలో విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా మొదటివారంలోనే ఐదు వందల కోట్ల గ్రాస్ కలక్షన్స్ ఈమూవీ తెచ్చుకుని అన్నీ అనుకూలిస్తే రెండవ వారం పూర్తి అయ్యేసరికి 1000 కోట్ల సినిమాగా మారడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాలలోని కొందరు వేస్తున్న అంచనాలు ప్రభాస్ అభిమానులకు మరింత జోష్ ను ఇస్తున్నాయి..