ఒక చిన్న వ్యాపారం మొదలుకుని వేల కోట్ల స్థాయిలో కొనసాగే వ్యాపార నిర్వాహణకు ప్రతి వ్యాపారానికి పెట్టుబడి కావాలి. అయితే ఈ పెట్టుబడి పెట్టే విషయంలో కూడ సృజనాత్మకత ఉండాలి. ఏ వ్యాపారానికి అయినా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి కానీ పరిమితి మించిన స్థాయిలో పెట్టుబడి పెడితే ఆ నిర్ణయం వల్ల వ్యాపారాలు నష్టాలలోకి వెళతాయి అని అనేక అధ్యాయాలు తెలియచేసాయి.
సంపదను కోరుకునే ప్రతివ్యక్తి తాను నిర్వహించబోయే వ్యాపారాన్ని ఎంపిక చేసే విషయంలో ఎలాంటి నేర్పును ప్రదర్శించాలో ఆ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం అన్న విషయంలో కూడ ఒక స్పష్టమైన అంచనా లేకుండా పెట్టుబడి విషయంలో దుబారాగా వ్యవహరిస్తే అది ఆ వ్యాపార నష్టాలకు ప్రారంభం నుండి దారి తీస్తుంది. ఉదాహరణకు ఒక వజ్రాల షాపును మెయిన్ సెంటర్ లో కాకుండా ఎక్కువమంది ధనవంతులు నివసించే ప్రాంతంలో పెట్టినా ఆ షోరూమ్ ను ఎవరు పట్టించుకోరు.
అదేవిధంగా ఒక పూల దుకాణం లేదంటే అరటి పండ్లబండిని రోడ్డు పక్కన కాకుండా ఎవరికీ కనిపించని ఒకమంచి పోష్ ఏరియాలో పెట్టినా ఆవ్యాపారం ఏమాత్రం విజయవంతం కాదు. టిలో కలుపుకోవడానికి చెక్కర అయిపోతే ఇంటి పక్కనే ఉన్న చిన్న దుకాణానికి వెళతారు కాని ఆ చక్కర కోసం పనులు మానుకుని మాల్స్ కు వెళతారని ఊహించడం అవివేకం.
ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని వ్యవస్థీకృత పెట్టుబడి ఎంత అవసరమో నిర్ణయించుకోవడానికి చాల శాస్త్ర బద్ధమైన విశ్లేషణలు జరగాలి. ఒక వ్యక్తికి ప్రధాన అవసరాలు అయిన ఆహారం బట్టలు విషయాలకు సంబంధించి వ్యాపారాలు చేసేవారు వారు చేసే వ్యాపార కార్య స్థానం బట్టి వారి వ్యాపారం పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. దీనితో అద్భుతాలు జరుగుతాయి అన్న కలలు కనకుండా తాము ఎంతవరకు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోగల నైపుణ్యం తెలిసిన వ్యక్తికి మాత్రమే ఐశ్వర్య ధామానికి మార్గాలు ఏర్పడి సంపన్న వంతుడు అవుతాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి