ఈ వీడియోకి , కేంద్రం నుంచి రెండు లక్షలు పొందడానికి గల సంబంధం ఏమిటి..అని ఆలోచిస్తున్నారా..? నిజమే ముందుగా వీడియోలు అనగానే మనకు సినీ లోకం గుర్తొస్తుంది.ఎందుకంటే ఈ సినీ ప్రపంచం లోనే కదా ఎక్కువగా వీడియోలు , ఫోటోలు రావడం గమనిస్తూ ఉంటాము. ఇక మోడీ సర్కార్ ప్రజలకోసం ప్రజలలో అవగాహన తీసుకోవడానికి ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులను, పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రజల శ్రేయస్సు కోసం సరికొత్త నిబంధనలను తీసుకురావడంతో పాటు ఇంకొత్త ఆంక్షలను కూడా విధిస్తుందన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలు ఈ పొగాకు బారిన పడుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ పొగాకు ప్రభావాన్ని ప్రజల్లో తగ్గించడం కోసం అన్ని చోట్ల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ఎవరూ, ఏ మాత్రం , ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. ఇక త్వరలోనే ఈ పొగాకు పై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది మోడీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు సరికొత్తగా ఒక కాంటెస్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పోటీలో పాల్గొనడం ద్వారా విజేతలు రెండు లక్షల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే , పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ప్రజల్లో ఎలాంటి నష్టం కలుగుతుంది అనే ఒక అంశం పై ప్రజల్లో అవగాహన కల్పించడమే.
ఈ పోటీలో పాల్గొనాలని అనుకునేవాళ్లు వరల్డ్ నో టుబాకో డే లో భాగంగా పొగాకు వల్ల ప్రజల్లో ఎలాంటి నష్టం కలుగుతుంది, అనే అంశం గురించి ఒక వీడియో తీయాల్సి ఉంటుంది. ఈ వీడియో వ్యవధి 30 సెకన్ల నుంచి 60 సెకన్ల నిడివి ఉన్న షార్ట్ వీడియో తీసి పంపించాలి. ఇందులో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు పాల్గొనడానికి అర్హులు. ఈ పోటీలో గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్ కింద రెండు లక్షల రూపాయలు, రెండవ ప్రైస్ కింద రూ.1.5 లక్షలు, మూడవ ప్రైస్ కింద ఒక లక్ష రూపాయల బహుమతి అందివ్వడం జరుగుతుంది . ఇక అంతేకాదు వీళ్లతో పాటు మరొక పది మంది పదివేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
https://www.mygov.in/task/short-film-making-contest ఈ వెబ్సైట్ ద్వారా జూన్ 30 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి