సాధారణంగా కొంతమంది ఇంట్లో ఎంత సంపాదించినా సరే ,డబ్బు నీళ్ల లాగ ఖర్చవుతుంది. అంతేకాదు వారు ఎంత కోటేశ్వరులు అయినప్పటికీ సంపాదించిన డబ్బు ఖర్చు అయి పోతూ ఉంటే, ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు . అయితే డబ్బు సంపాదించినది దాచుకోక పోవడం ఒక ఎత్తయితే, దానిని ఖర్చు చేయడం మరొక ఎత్తు.. ఇకపోతే మరికొంతమంది ఇంట్లో డబ్బులు దాచి పెట్టే బీరువా కూడా సరైన స్థానంలో లేకపోతే కుబేరుడు ఆ స్థలంలో నిలవలేక, అక్కడనుంచి వెళ్ళి పోతాడు అని కొంత మంది అంటూ ఉంటారు. ఇంట్లో బీరువా ఏ మూలన ఉండాలి ..మీ ఇంట్లో ఏ మూలన ఉంది ..? అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం..

ముఖ్యంగా భారత దేశంలో చాలా మంది నగలను, డబ్బులను బీరువాలోనే దాచుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం. అంతేకాదు ఉదయాన్నే ఆ బీరువా ముఖం  చూడనిదే  కొంతమందికి రోజు కూడా గడవదు.ఇక  వాస్తు నిపుణులతో పాటు జ్యోతిష్య పండితులు కూడా ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.. అని సూచిస్తున్నారు. అదేమిటో మీరు కూడా ఒక సారి వివరంగా తెలుసుకోండి.

లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువు ఉంటుందో.. అక్కడ చాలా శుభ్రంగా ఉండాలి అని , జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశం కానీ,  ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ చాలా శుభ్రంగా ఉండాలి. ఒకవేళ లేనియెడల దరిద్ర దేవత ఆవహించి లక్ష్మీదేవిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకొడుతుందట. ముఖ్యంగా మీ ఇంటి బీరువాపై బరువు ఉంచడం కానీ లేదా బీరువా తలుపులకు అద్దం ఉంచడం కానీ లాంటివి చేయకూడదు. లక్ష్మీ దేవత బరువు గా భావించి అక్కడి నుంచి వెళ్లి పోతుందట.

బీరువా కు అద్దం ఉండి అలంకరించుకుంటుంటే అమ్మవారికి కోపం వస్తుందట. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు. ఇక బీరువా ఏ మూల లో ఉంచాలి అంటే దక్షిణానికి - పశ్చిమానికి మధ్యలో నైరుతి మూలలో బీరువాను ఉంచడం వల్ల అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లోనే ఉంటాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: