
వడ్డీ రేట్లపై డిస్కౌంట్ లను అందిస్తూ హోమ్ లోన్ పొందాలనుకునే వారికి చక్కటి శుభవార్తను అందించింది.. వాస్తవానికి మొన్నటి వరకు బజాజ్ ఫిన్ సర్వ్ హోమ్ లోన్స్ పై వడ్డీ రేటు 8.6% నుంచి ప్రారంభం అయ్యేది. కానీ ఇప్పుడు హోమ్ లైన్స్ పై వడ్డీ రేటును 8.5% నుంచే మొదలు పెడుతున్నారు అంటే తక్కువ వడ్డీ రేటుకే మీరు హోమ్ లోన్ పొందవచ్చు దీర్ఘకాలం వరకు ఉంటుంది. కాబట్టి ఇందులో కొంచెం వడ్డీరేట్లు తగ్గుదల కనిపించినా కూడా దానిని మీరు బెనిఫిట్ గా పొందవచ్చు.
బజాజ్ ఫిన్ సర్వ్ నుంచి కస్టమర్లు రూ. 15 కోట్ల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వడ్డీ రేటు కూడా 8.5 నుంచి మొదలవుతుంది.. అంటే అప్పుడు ఈఎంఐ కింద మీరు రూ.లక్షకు రూ.769 చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ అప్రూవల్ కేవలం 48 గంటల్లోనే మీరు పొందవచ్చు అని.. బజాజ్ ఫిన్ సర్వ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా హోమ్ లోన్ పై ఎలాంటి ఫోర్ క్లోజర్ చార్జీలు కూడా ఉండవు అని ఈ కంపెనీ తెలిపింది. ఇక ప్రాసెసింగ్ ఫీజు ఏడు శాతం వరకు ఉంటుందని, బౌన్స్ చార్జీలు రూ. 3000 వరకు పడతాయని , ఇక పార్ట్ పేమెంట్ ఛార్జీలు ఉండవని కూడా తెలిపింది.