ఇప్పటివరకు సంవత్సరానికి 6000 రూపాయల చొప్పున 13 విడతల్లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని రైతులకు వారి ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే . ఇప్పుడు 14వ విడత డబ్బులను కూడా ఈ నెల 27వ తేదీన రైతుల ఖాతాలో వేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 27వ తేదీన రాజస్థాన్ లోని షికారులో ఈ కార్యక్రమానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ పథకం కింద అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే ప్రతి రాష్ట్ర రైతులు లబ్ధి పొందుతున్న విషయం తెలిసిందే.
ఇక రైతులకు ఈ పథకం కింద సుమారుగా 8.5 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పంటలు పెట్టుకునే సమయం ఆసన్నం కావడంతో పెట్టుబడి కింద ఇప్పుడు రూ .2000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయనార్థం డబ్బు రైతులకు కొంతవరకు ఊరటను కలిగిస్తోందని చెప్పడంలో సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి