గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే అంశాన్ని వెల్లడిస్తూ శుభవార్త తెలిపింది. సిలిండర్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా సిలిండర్ వినియోగదారులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ విషయాన్ని తెలిపారు. ముఖ్యంగా సామాన్యులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఇలా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉంది అని ఆయన స్పష్టం చేశారు.

తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ సిలిండర్ పైన 200 రూపాయల వరకు సబ్సిడీ అందిస్తోంది. ఇక కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రభుత్వం మద్దతు పలికింది అంటూ గుర్తు చేశారు. ఇక మూడు ఉచిత సిలిండర్లను అందించడం , ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు,  దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారికి ప్రభుత్వం ఈ విధంగా సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. కరోనా సమయంలో బలహీనవర్గాల కుటుంబాలకు మూడు సిలిండర్లను ఉచితంగా అందజేయడం వల్లే ఇప్పుడు సిలిండర్ వినియోగం కూడా బాగా పెరిగిపోయిందని.. ఉచిత సిలిండర్ల వల్ల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఊరట కలిగిందని ఆయన తెలిపారు.

ఇకపోతే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయిల్ బ్రాండ్లపై ఇప్పటికే ప్రభుత్వం మీద భారం పడుతుందని.. రూ .3లక్షల 50 వేల కోట్ల వరకు భారం పడుతోందని ఆయన వెల్లడించారు. ఇకపోతే ఆగస్టు ఒకటి నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించగా ఢిల్లీలో ప్రస్తుతం ఆ సిలిండర్ ధర రూ .1680 ఉంది. ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి.. ఈ ధరలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మళ్లీ మారే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: