చాలామంది యువత ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రకారం ప్రజలకు అవసరమైనటు వంటి రంగాలలోనే బిజినెస్లను సైతం మొదలు పెడుతూ భారీగానే సంపాదిస్తున్నారు. కెరియర్ను ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ప్లాన్ చేసుకొని మరి ముందుకు వెళ్తున్నారు. ఉద్యోగం చేసేవారు కూడా కాస్త బిజినెస్ వైపుగానే ప్లాన్ చేస్తున్నారు.. అయితే బిజినెస్ అనగానే చాలామంది చాలా నష్టపోతామనే అపోహలో ఉంటారు.. దీని కారణంగానే చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు.. కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని మొదలు పెడితే సరైన లాభాలను సైతం పొందవచ్చు.


అలాంటి ఒక బిజినెస్ ఐడియా ఉన్నది.. ఎక్కువగా ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి వాటిలో ప్లాస్టిక్ చాలా ప్రమాదకరంగా ఉన్నది.. దీనివల్ల రోజురోజుకి మనిషి ఆరోగ్యం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో చాలామంది పేపర్ గ్లాసులు పెద్ద ఎత్తున అందుబాటులోకి  వస్తున్నాయి. అవసరాన్ని బట్టి ఈ వ్యాపారాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మంచి లాభాలు వస్తాయి.. పేపర్ కప్ తయారీ యూనిట్ చాలా తక్కువ బడ్జెట్ లోనే ప్రారంభించుకోవచ్చు..


ఇందుకోసం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పని కూడా లేదు.. పేపర్ కప్ తయారీ బిజినెస్ ను చిన్న బిజినెస్ గా కూడా మొదట మొదలు పెట్టవచ్చు. దీని మిషన్ ధర కేవలం లక్ష నుంచి కూడా అందుబాటులో ఉన్నది..చాలా కప్స్ లను సైతం తయారు చేసేటువంటి పెద్ద మిషన్ తీసుకోవాలి అంటే రూ .10 లక్షల రూపాయల వరకు చెల్లించాలి. అలాగే కొంత ఖాళీ స్థలంతో పాటు విద్యుత్ కనెక్షన్ సదుపాయం కూడా ఉండాలి.. వీటిపైన బిజినెస్ మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వం 75% వరకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తుంది. పేపర్ కప్స్ తయారీ రా మెటీరియల్ కి చాలా అవసరము.. ప్రతి ఏడాది కూడా సరాసరి రెండు కోట్లకు పైగా పేపర్ కప్పులను సైతం తయారు చేయవచ్చట. దీంతో కనీసం 40 పైసలు వేసుకున్న మంచి లాభం లభిస్తుంది.. లేకపోతే మీరే ఓన్ గా అయిన డిస్ట్రిబ్యూషన్ అయినా సెల్ అయిన చేసుకుంటే మరింత లాభం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: