గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఎప్పుడూ కూడా మంచి డిమాండ్ ఉంటుంది.. అక్కడ పెట్టుబడి పెడితే పూర్తిగా భద్రతతో పాటు ప్రభుత్వ భరోసా ఉంటుందని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. పైగా ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలలో ఎక్కువగా అధిక వడ్డీ వస్తూ ఉండడంతో అందరూ వీటి వైపుగానే మక్కువ చూపుతూ ఉంటారు. అందుకు అనుగుణంగానే పోస్ట్ ఆఫీస్ లలో కూడా పలు రకాల పథకాలను వినియోగించుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకులతోపాటు దీటుగానే పోస్ట్ ఆఫీసులు కూడా మంచి రాబడి ఇచ్చే పథకాలను వస్తున్నాయి.


అలాంటి వాటిలో టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి.. ఎవరికైనా మంచి రాబడితో సొమ్ము భద్రంగా ఉండాలి అంటే ఈ పోస్ట్ ఆఫీస్ కి బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పవచ్చు.. దీనినే పోస్ట్ ఆఫీస్ FD అని కూడా పిలుస్తూ ఉంటారు ఇందులో..6.9 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని కూడా పొందవచ్చు.. టైమ్ డిపాజిట్ ప్లాన్ ని ఉపయోగించి ఇందులో ఇన్వెస్ట్ చేసేవారు.. స్వల్పకాలిక దీర్ఘకాలిక పెట్టుబడులు చేసి రెండు మూడు ఏళ్లలోనే డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. వీటిని ఎవరైనా ముగ్గురు పెద్దలు కలిసి ఉమ్మడి ఖాతా గా కూడా తీసుకోవచ్చు.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్న పిల్లలు పేరు మీద కూడా ఈ టైం డిపాజిట్ ను చేయవచ్చు..

అయితే ఇందులో కనీసం వెయ్యి రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఒక సంవత్సరం పాటు పెట్టుబడి పెడితే అందులో 6.9 శాతం వడ్డీ వస్తుంది రెండేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7 శాతం లభిస్తుంది. అలా ఐదేళ్లపాటు చేస్తే 7.5 శాతం వడ్డీ వస్తుంది.. అయితే ఐదు సంవత్సరాల కంటే తక్కువ డిపాజిట్లు ఉన్నవారికి పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: