కరోన మహమ్మారితో చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.ఎంతో మంది పని దోరకగా చిన్న చిన్న వ్యాపారాలను కూడా చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులలో చాలా మంది తెలివిగా చిన్న చిన్న బిజినెస్లను చేసుకుంటున్నారు.. చాలా మంది రకరకాల పనులను ఎంచుకొని ముందుకు వెళ్తున్నారు.. వ్యవసాయంలో అనుభవం ఉన్నవారికి ఇతరత్రా వ్యాపారాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి.. అయితే తక్కువ సమయంలోనే మంచి ఆదాయాన్ని సంపాదించాలనుకునేవారు కలబంద వ్యవసాయాన్ని ప్రారంభించడం చాలా మంచిది.. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో కలబందకు మంచి డిమాండ్ ఉన్నది.. ఈ కలబంద ఎన్నో ఔషధాలు తయార్లలో కూడా ఉపయోగించడమే కాకుండా సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.


ఇండియాలో ప్రజలు కలబందను విపరీతంగా సాగు చేస్తున్నారు.. ముఖ్యంగా నీరు ఎక్కువగా లేని ప్రాంతాలలో కూడా వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇసుక నెల కలబందకు సాగునెలాగ మారుతోంది. ఒక్కో కలుపు మొక్కకు మధ్య రెండు అడుగుల వ్యత్యాసం ఉండేలా నాటుకోవడం వల్ల పెరుగుదల సమృద్ధిగా లభిస్తుంది.. నిపుణులు అభిప్రాయం ప్రకారం కలబంద అక్టోబర్ నవంబర్ నెలలో బాగా సాగు చేయవచ్చని.. ఈ కలబంద ఏడాది పొడవున దిగుబడి ఉంటుందని వెల్లడిస్తున్నారు.


ఈ మొక్కకు చిన్న చిన్న ముల్లులు ఉండడం వల్ల ఏ జంతువులు వీటిని తినలేవు.. ఇక సంపాదన విషయానికి వస్తే ఒక ఎకరా పొలంలో 12,000 కనబడు చెట్లని నాటితే ఒక చెట్టు కనీసం నాలుగు రూపాయలు చొప్పున ఖర్చవుతుంది.. ఇలా మొత్తం అన్ని చెట్లు నాటడానికి 50 వేల వరకు ఖర్చవుతుంది. దీని ద్వారా మీరు ఒక్కో చెట్టును పది రూపాయల వరకు అమ్ముకున్న.. మొత్తం మీద రూ.12,0000 వరకు సంపాదించుకోవచ్చు.. అయితే మీరు ఒక పంటను 80000 రూపాయల వరకు సైతం లాభాలను పొందుకోవచ్చు.. అయితే ఈ కలబంద మొక్కను ఒకసారి నాటితే చాలు ఆకులు కోసి అమ్మే కొద్దీ వస్తూనే ఉంటాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: