డ్రగ్స్ కేసులో దీపికా ఎన్సీబీ ముందు విచారణకు హాజరయ్యారు. దీపికాతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ ఈ విచారణకు హాజరు కావడం జరిగింది. దీపికా పదుకొనె మరియు మేనేజర్ కరిష్మా ప్రకాష్ డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ కోణంలోనే దీపికా మరియు కరిష్మా ప్రకాష్ ని అధికారులు విచారించనున్నారు. అలాగే శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ కూడా ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కావాల్సివుంది.