ఈ కరోనా నేపథ్యంలో ''థియేటర్స్ ఓపెన్ చేస్తే మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారా?" అని ఓ మీడియా ఛానల్ నిర్వహించిన పోలింగులో అధికులు దీనిగురించి నెగటివ్ గా చెప్పినట్లు పేర్కొంది. కాగా అత్యధిక మంది కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్తామని చెప్పారు. ఈ పోల్ లో 27% మంది థియేటర్ లో చూస్తామని చెప్పగా.. 31% చూడమని చెప్పారు. 36% మంది వ్యాక్సిన్ వచ్చే వరకు థియేటర్స్ కి వెళ్ళమని చెప్పారు. మిగతా వారు ఏమో చెప్పలేమని అన్నారు.