రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరవాత ఇంతవరకు తన సినిమా ను రిలీజ్ చేయకపోవడం అభిమానులకు కోపం తెప్పిస్తూ ఉంది.. బాహుబలి తరువాత మరో హిట్ కోసం ఆకలిగా ఉన్న ఫాన్స్ కి సాహో నిరాశ నే మిగిల్చింది.. దాంతో రాధే శ్యామ్ అయినా వారికి ఫుల్ మీల్స్ పెడుతుందేమో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల రోజు రోజుకు లేట్ అయిపోతుండడంతో వారిలో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే పాత్ర ప్రేరణ ఫస్ట్ లుక్ ని ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే రిలీజ్ చేయగా ఆ పోస్టర్ కి మంచి స్పందన లభించింది.