రాజకీయాలకు చిన్న పాజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. మధ్య మధ్య ప్రజలను పలకరిస్తూనే సినిమాలు కూడా చకచకా చేసేస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా పూర్తి కావొచ్చింది. సమ్మర్ కి రిలీజ్ చేసే దిశగా పనులు సాగుతున్నాయి..దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. బాలీవుడ్ లోని పింక్ సినిమా కథను పవన్ కళ్యాణ్ చేయడం విశేషం..తెలుగు నేటివిటి కి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ హీరోయిజానికి తగ్గ మార్పులు చేసి ఈ సినిమా ని ఇక్కడ చేస్తున్నారు.