యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు రౌడీ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ కు అన్ని భాషల్లోనూ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.. సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూడ్ తో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారిలో కొత్త జోష్ ని నింపుతూ ఉంటాడు..