ఈరోజుల్లో అనే చిన్న బడ్జెట్ సినిమా చేసి అందరి కళ్ళల్లో పడ్డ మారుతి ఆ తరువాతి చిత్రం బస్ స్టాప్ తో నూ మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఈ రెండు సినిమాలు ఇచ్చిన హిట్ తో ఇక మారుతీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి.. అల్లు శిరీష్ తో చేసిన కొత్త జంట, నాని భలే భలే మొగాడివోయ్, శర్వానంద్ మహానుభావుడు లాంటి సినిమాలు మారుతి కి కూడా మంచి పేరును తెచ్చి పెట్టాయి.. మారుతీ ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు కొట్టి స్టార్ దర్శకుడిగా స్థిరపడ్డాడు.. ఇటీవలే సాయి ధరం తేజ్ తో చేసిన ప్రతిరోజు పండగే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు..