అక్కినేని వారసుల్లో లక్ తక్కువ గా ఉన్న హీరో ఎవరంటే అఖిల్ అని చెప్పాలి. అయన నటించిన మూడు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి.. తొలి సినిమా 'అఖిల్' డిజాస్టర్ గా మిగిలిపోయింది.. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన 'హలో' సినిమా నిరాశనే మిగిల్చింది.. మూడో సినిమా ' మిస్టర్ మజ్ను ' పరవాలేదనిపించుకుంది.. మొత్తానికి అఖిల్ చేసిన మూడు సినిమాలు అక్కినేని అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. దాంతో నాలుగో సినిమా తో అయినా హిట్ కొట్టి తన ఆకలి తీర్చుకోవాలని చూస్తున్నాడు అఖిల్..