దేవదాస్ సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టిన రామ్ తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకోవడమే కాకుండా హిట్ ల మీద హిట్ లు కొడుతూ కెరీర్ ను సాఫీగా సాగించాడు.. అయితే ఆమధ్య వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ ని ఇస్మార్ట్ శంకర్ సినిమా గట్టెక్కించింది.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రామ్ మునుపెన్నడూ కనపడని విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఆ సినిమా ని పెద్ద హిట్ చేశారు.