టాలీవుడ్ లోని వారసుల్లో ఇంకా కుదురుకుని హీరో ఎవరైనా ఉన్నారంటే అది అక్కినేని అఖిల్ అని చెప్పాలి.. మూడు సినిమాలు చేసిన అఖిల్ ఇంకా హిట్ కొట్టలేదు.. కథల ఎంపిక లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ప్రతిసారి అఖిల్ పై భారీ అంచనాలు పెట్టుకోవడం, అవి అఖిల్ అందుకోకపోవడంతో అయన చేసిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి.. మాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చేసిన తొలి సినిమా ఫ్లాప్ అయ్యింది.. పోనీ క్లాస్ ప్రేక్షకులనైనా టార్గెట్ చేసి హిట్ కొడదామా అని చేసిన తర్వాతి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డాయి..