ఏ మాయ చేశావే చిత్రంతో అందరిని మాయ చేసిన సమంత ఆ సినిమా తర్వాత ఆమెకు ఏర్పడ్డ క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే.. ఆ సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటుతున్నా సమంత కి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. దీనికి తోడు అక్కినేని కోడలై వారి ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా చూరగొన్నది. చాల తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత పెళ్లి కాకముందే పెద్ద స్టార్.. అయితే చాలామంది హీరోయిన్ లు పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపారు. కానీ సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తుంది.