ఇతర భాషల్లో ఏమో కానీ తెలుగు లో బిగ్ బాస్ షో ప్రాభవం చాలానే ఉంది.. ఈ షో లో పాల్గొన్న వారంతా ఎంతోకొంత బిగ్ బాస్ పేరు చెప్పుకుని ఎంతోకొంత వెనకేసుకుంటున్నారు.. షో ద్వారా వచ్చే డబ్బులు ఒక ఎత్తు అయితే షో తర్వాత వచ్చే అవకాశాలు మరొక ఎత్తు అయ్యాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 లో పాల్గొన్న చాలామంది పార్టిసిపెంట్స్ ఇప్పుడు మంచి అవకాశాలతో దూసుకెళ్తున్నారు.. ఇక ఈ షో ద్వారా పాపులర్ అయినా అఖిల్ , మోనాల్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ అందరికి తెలిసిందే. వీరిద్దరూ హౌస్ లో ఉన్నంత సేపు ఎంత ప్రేమగా ఉన్నారో, బయట కూడా అలాగే ఉన్నారని వారి సోషల్ మీడియా లో పెట్టె ఫోటోలను చూస్తే తెలుస్తుంది..