తాజా పరిణామాలపై వివరించడానికి ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవాలనుకుంటున్నారు. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి ఆయనకు క్లియరెన్స్ రాలేదు. నిమ్మగడ్డ మాత్రమే కాదు, రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా గవర్నర్ తో భేటీ కోసం ప్రయత్నిస్తున్నాయి.