ప్రియాంక చోప్రా.. బాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత హాలీవుడ్ కే పరిమితమైపోయింది.అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ తో నటించి అనతికాలం లోనే అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా నిలిచింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన హీరోయిన్ గా పలు సినిమాలు చేసి అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఎలాంటి పాత్రనైనా చేసే ప్రియాంక బోల్డ్ పాత్రలు చేయడంలో స్పెషలిస్ట్.. తన అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది..