మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ షో తర్వాత ఆమె కు ఫాలోయింగ్ మాములుగా లేదు. షో ఉన్నప్పుడే ఎమోషనల్ అవుతూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పటికే ఐటెం సాంగ్ లతో అదరగొట్టేస్తుంది.. ఒక టాప్ షో లో జడ్జ్ గా కూడా చేస్తుంది.. అంతేకాకుండా ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తుంది.. ఆ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాగా, ఇది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో అఖిల్ హీరో గా నటిస్తున్నాడు.