కొత్తగా వస్తున్న కమెడియన్ ల రాకతో పాత కమెడియన్ లు మరుగున పడిపోతున్న విషయం తెలిసిందే.. ఎప్పుడైతే జబర్దస్త్ కామెడీ షో మొదలైందో తెలుగులో కమెడియన్ లకు కొదువ లేదు.. వారిదైనా టాలెంట్ తో దర్శక నిర్మాతలను ఒప్పిస్తూ అవకాశాలు కొట్టేస్తున్నారు. ఇక పాతతరం వారికి సుపరిచమైన సుమన్ శెట్టి ప్రస్తుతం ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తలేదు. తెలుగులో వరుస హిట్ సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసిన సుమన్ శెట్టి కి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది.. తేజ సినిమాల్లో ఎక్కువగా కనిపించే సుమన్ శెట్టి రాను రాను ఎందుకో పోటీ లోనెగ్గుకు రాలేకపోయాడు..