టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమా మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఉప్పెన రిలీజ్ అయ్యి మంచి టాక్ ని తెచ్చుకుంది..సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతుంది.. లాక్ డౌన్ కన్నా ముందే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా థియేటర్లు లేని కారణంగా సినిమా ని ఇప్పటివరకు రిలీజ్ చేయకుండా ఉంచారు.. OTT నుంచి ఎన్ని ఆఫర్స్ లు వచ్చినా రిలీజ్ చేయకుండా ఉంచారు. ఆ నిరీక్షణ కి ప్రతిఫలం దక్కింది.