రిస్క్ తీసుకోవడం హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్కి మహా సరదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తన చేసే చాలా సినిమాలలో స్టంట్లన్నీ దాదాపు స్వయంగానే చేస్తుంటారు. ఎంత రిస్క్ ఉందన్నది పట్టించుకోకుండా... ఆ సన్నివేశం సినిమాకి ఎంత ముఖ్యమైనధో ఆలోచించి దానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాంటి ఈ విలక్షణ నటుడి ఫన్నీ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.