టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. అప్పటికీ పాన్ ఇండియా సంస్కృతి ఇండియా లో లేని సమయంలో ఈ సినిమా ని అంత పెద్దగా ఖర్చుపెట్టి చేసి రిలీజ్ చేయడం అంటే మాములు విషయం కాదు.. పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా ని దేశం అంతటా ప్రజలు ఆదరించారు..ఇక ఈ సినిమా తర్వాత దేశమంతటా పేరు సంపాదించుకున్న సినిమా కేజీఎఫ్..కన్నడ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. ఈ సినిమా తో యష్ కూడా ప్రభాస్ లాగే దేశమంతటా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు..