టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ టైం ప్రస్తుతం అంత బాగా ఎం లేదు.. అయన ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం విఫలమవుతుంది.. చివరిగా అయన రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే సినిమా చేశారు. ఆ సినిమా కూడా అనుకున్నంత ఆడకపోవడంతో అయన కెరీర్ ప్రమాదంలో పడింది అనుకున్నారు.. ఆ సినిమా వచ్చి చాల సంవత్సరాలే అయినా అయన నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.. రంగమార్తాండ అనే సినిమా ని మొదలుపెట్టినా అది ఇంకా రిలీజ్ కాలేదు.