సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత మహేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాట సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో దసరా పండుగ సందర్భంగా లేదా నవంబర్ నెలలో దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే.. సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయి