బాలీవుడ్ సినీ పరిశ్రమ కేవలం కొన్ని ముఖ్యమైన కుటుంబాల ఆధీనంలోనే ఉందని సినిమా వర్గాలు గుసగుసలాడుకుంటూ ఉంటాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియకపోయినా దానిని కొంత వరకు వాస్తవం అని చెప్పే నెపోటిజంపై ఎంత రగడ జరిగిందో మీకు తెలిసిందే. ఈ నెపోటిజం అనే సమస్య సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో మొదలయింది. ఈ తరహాలోనే ఎంతోమంది టాలెంటు ఉన్నా ఎదగలేకపోతున్నారనే అపవాదు ఉంది.