కేజీఎఫ్ చిత్రంతో దేశమంతటా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఉగ్రం సినిమాతో సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన ఆయన తొలి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. బెస్ట్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ కి నామినేట్ అయిన ప్రశాంత్ నీల్ ఉత్తమ దర్శకుడిగా గా సైమా అవార్డును అందుకున్నాడు.