హీరోయిన్ రంభ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈమె ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి బాక్సాఫీస్ ను షేక్ చేసిన హీరోయిన్. ఈమె అసలు పేరు విజయలక్ష్మి ఊరు విజయవాడ. ఆమె చదువుకుంటున్న రోజుల్లో స్కూల్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా అక్కడికి వచ్చిన డైరెక్టర్ హరిహరన్ 1992 వ సంవత్సరంలో విజయలక్ష్మికి పదిహేనేళ్ళ వయసు ఉండగా మలయాళంలో "సర్గం" అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు.