ప్రదీప్ ఈ సినిమాలో ప్రగతి చెప్పే ఏ మాటకైనా సరే "అంతేగా అంతేగా" అంటూ అమాయకంగా అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. కానీ ఈయన అంతకు ముందే ప్రదీప్, పూర్ణిమ కలిసి నటించిన చిత్రం "ముద్దమందారం". ఈ సినిమా 1981లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత 1982లో తిరిగి జంధ్యాల గారి దర్శకత్వంలోనే నరేష్, ప్రదీప్, తులసి, పూర్ణిమ అందరూ కలిసి నటించిన చిత్రం నాలుగు స్తంభాలాట. ఈ సినిమా ఏకంగా 175 రోజులు ఆడడం విశేషం.బుల్లితెర మీద కూడా ఎన్నో సీరియల్స్ లో నటించి, దర్శకత్వం కూడా వహించారు.