కరోనా కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కళతప్పింది. దాదాపు రెండు సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఎట్టకేలకు కొంత గ్యాప్ ఇచ్చినట్లే ఉంది. ఈ గ్యాప్ లో తొందరగా ఆగిపోయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసుకుని థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సినిమా నిర్మాతలు మరియు దర్శకులు.