చిన్నారిపెళ్లి కూతురు సినిమా నుండి సరాసరి టాలీవుడ్ ఇండస్ట్రీకి రెడ్ కార్పెట్ వేసుకుని వచ్చిన చిన్నది అవికా గోర్. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ సినిమాల హిట్ తో మంచి జోష్ మీదున్న అమ్మడు అసలు తగ్గట్లేదట. బాలీవుడ్లో ఓ బుల్లితెర ప్రోగ్రాం కూడా చేస్తున్న ఈ సుందరి తనని ఎవరు పెద్ద దానిలా భావించట్లేదని ఫీల్ అయ్యిందో ఏమో తన ఒంటిమీద పర్సనల్ భాగంలో ట్యాటూ వేయించుకుని అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఓ పబ్లిక్ మీట్ కి అటెండ్ అయిన ఈ భామ మెడ కింద ఓ ట్యాటూ దర్శన మిస్తుంది.


అంతేకాదు చేతులకు కాళ్లకు ఎక్కడ పడితే అక్కడ ట్యాటూ వేయించికుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ట్యాటూల పిచ్చిలో తన్నుకు చస్తున్న హీరోయిన్స్ జాబితాలో తను కూడా చేరి తానేం తక్కువ కాదంటూ ఋజువు చేసింది. కెరియర్ సాఫిగానే సాగుతున్నా అమ్మడు ఇంకా చిన్న సినిమాలకే పరిమితమవ్వడం తనకి అన్ సాటిస్ఫైడ్ గా ఉంది కాబోలు. అందుకే ట్యాటూతో ఇంప్రెస్ చేస్తే ఏమన్నా పెద్ద దర్శక నిర్మాతలుతన వైపు చూస్తారేమో నని బుజ్జి భామ ప్రయత్నం. అయినా ఒంటిమీద ట్యాటూ వేయించుకుంటే ఆఫర్లేమో కాని వేరే మీనింగ్ ఆడియెన్స్ లోకి వెళ్తుంది.


సినిమా చూపిస్తా మావలో అవికా గోర్:


ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసిన అవికా వాటి ఎనౌన్స్ మెంట్ గురించి వెయిట్ చేస్తుంది. బుల్లితెరలో కనిపించి మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు సినిమాల్లో కూడా తన మార్క్ నటనను కనబరుస్తూ సూపర్ క్రేజ్ సంపాధించింది. మరి ట్రెండ్ ఫాలో అవ్వాలనో లేక తనలో ఉన్న మరో యాంగిల్ ని చూపించాలనో అవికా సడెన్ గా ఇలా ట్యాటూలతో బయటపడ్డది. ఓకవేళ రొమాంటిక్ సినిమాలను కూడా చేసే ఉద్దేశంతో అమ్మడు ఏమన్నా ఇలా హింట్ ఇస్తుందా అన్న డౌట్ కూడా వస్తుంది దర్శక నిర్మాతలకు. 


అదే కారణం అయితే ఏముంది చెప్పండి.. ఏ దర్శకుడో మంచి రెండు మూడు లిప్ లాక్ లున్న కతర్నాక్ స్టోరీని అవికా దగ్గరకు పట్టుకెళ్తాడు. మరి అందులో కొద్ది పాటి క్రేజ్ ఉన్న హీరో నటిస్తే చాలు.. ఎందాకని కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తుంది చెప్పండి. బోల్డ్ సినిమాలు కూడా చేస్తే కాస్త పబ్లిసిటీ కూడా బాగా వస్తుంది. మాస్ ఆడియెన్స్ కి కూడా అమ్మడు చేరువయ్యే చాన్స్ వస్తుంది. మరి అమ్మడు ట్యాటూతో కనిపిస్తేనే ఇన్ని ఆలోచనలు వస్తే ఇక రొమాంటిక్ సినిమాలతో, స్కిన్ షో చేస్తా అని పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చేస్తే అదుర్స్ అన్నట్టే. మొత్తానికి వచ్చిన కొద్దిపాటి తన మీద క్రేజ్ ని ఫోకస్ షిఫ్ట్ అవ్వకుండా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది అవికా గోర్.  


మరింత సమాచారం తెలుసుకోండి: