మిస్టర్ పర్ఫక్ట్ తర్వాత ప్రభాస్ సినిమా ఇంతవరకు ఏదీ విడుదల కాలేదు. సాటి హీరోలందరూ వేగంగా దూసుకుపోతుంటే ప్రభాస్ మాత్రం నిలబడి నీళ్ళు తాగాలన్నట్టు వ్యవహరిస్తున్నారు.ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రెబెల్. ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో తొలుత అనుష్కను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. తమన్న, దీక్షాసేథ్ నటిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా తయారవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన హెలికాప్టర్ సన్నివేశాలు తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. తమన్ తప్పుకోవడంతో సంగీత బాధ్యతలను కూడా లారెన్స్ నిర్వర్తిస్తున్నారు. డాన్ సినిమాకు కూడా లారెన్స్ స్వరాలు సమకూర్చిన సంగతి, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అనే పాట హిట్ అయిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: