సినీ పరిశ్రమకు సేవా పన్ను మినహాయింపు ఇవ్వకపోతే సినిమాలు తీయడం మరింత కష్టసాధ్యమౌతుందని ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ అన్నారు. చలన చిత్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సేవా పన్నును తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
‘మనరాష్ట్రంతోపాటూ తమిళనాడు, కర్ణాటక చలన చిత్ర పరిశ్రమలకు చెందిన పెద్దలందరమూ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలవనున్నాం. సేవాపన్ను వెంటనే ఎత్తివేయాలని మా వాణిని వినిపించనున్నాం. ఒకవేళ ఈ పన్నును రద్దుచేయకపోతే సినిమాలు తీయబోం అని తెలియజేయాలనుకుంటున్నాం’ అన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: