పూరి జగన్నాథ్ సినిమా అంటేనే హీరోయిన్ కి పండగే. ఇంతకుముందు రాఘవేంద్రరావు, ఇప్పుడు పూరి జగన్నాథ్ చిత్రాల్లో నటించే అవకాశం కోసం నాయికలు ఎదురుచూస్తున్నారు. తొలి చిత్రంతోనే రాఘవేంద్రరావు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తాప్సీ ఇప్పుడు పూరి సినిమాలో నటించనుంది. ఇటీవల ఈ అవకాశాన్ని మూటగట్టుకుంది తాప్సీ. పూరి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే అల్లు అర్జున్ సినిమాను ప్రారంభిస్తారు. ఈ సినిమాలో తాప్సీని నాయికగా ఎన్నుకున్నారు. అంటే తాప్సీ లక్కీ చాన్స్ కొట్టేసినట్టే. ఇటీవలే పుట్టిన రోజును జరుపుకున్న తాప్సీకి ఇది బర్త్ డే గిఫ్ట్.
మరింత సమాచారం తెలుసుకోండి: